Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

2024లో అమెరికా అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ చేయ‌నున్న డ్వేన్ జాన్స‌న్‌

  • వెల్ల‌డించిన న‌టుడు
  • యాక్టింగ్‌లో బిజీ కార‌ణంగా 2024 వ‌ర‌కు ఆగ‌క త‌ప్ప‌డం లేద‌న్న రాక్‌
  • ప్ర‌జ‌లు ఆద‌రిస్తార‌ని న‌మ్మకం వ్య‌క్తం చేసిన డ్వేన్‌
హాలీవుడ్ న‌టుడు, మాజీ రెజ్ల‌ర్ డ్వేన్ 'ద రాక్‌' జాన్స‌న్ 2024లో అమెరికా అధ్య‌క్షుడి ప‌ద‌వికి పోటీచేస్తాన‌ని వెల్ల‌డించారు. వెరైటీ పత్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ విష‌యాన్ని చెప్పారు. 2018 నుంచి 2021 వ‌ర‌కు తాను పూర్తి చేయాల్సిన సినిమాలు ఉన్న కార‌ణంగా 2024 అయితే తాను పోటీ చేయ‌డానికి అనుకూలంగా ఉంటుంద‌ని ఆయ‌న తెలిపారు.

అయితే గ‌త కొద్దికాలంగా డ్వేన్ అమెరికా రాజ‌కీయాల్లో అడుగుపెడ‌తార‌ని కొన్ని వార్త‌లు వ‌స్తున్నాయి. దీన్ని ఆధారంగా తీసుకుని వాషింగ్ట‌న్ పోస్ట్ ప‌త్రిక ఓ స‌ర్వే కూడా నిర్వ‌హించింది. ఆ స‌ర్వేలో డ్వేన్ గెలిచే అవ‌కాశాలు బాగానే ఉన్న‌ట్లు పేర్కొంది. ఈ స‌ర్వే చూసిన త‌ర్వాత తన‌కు రాజ‌కీయాల్లోకి రావాల‌న్న ఆస‌క్తి మ‌రింత పెరిగింద‌ని డ్వేన్ అన్నారు. 'నేనెప్పుడూ రాజ‌కీయాల్లోకి వ‌స్తాన‌ని బ‌హిరంగంగా చెప్ప‌లేదు. కానీ ప్ర‌జ‌లు న‌న్ను రావాల‌ని కోరుకుంటున్న‌ట్లు ఈ స‌ర్వే ద్వారా వెల్ల‌డైంది. అందుకే వారి కోసమైనా దీని గురించి నేను సీరియ‌స్‌గా ఆలోచిస్తాను' అని డ్వేన్ అన్నారు.
dwayne johnson
america
potus
the rock
presidential elections

More Telugu News